గాంధారి మండలములో తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా మని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపోతంగల్ మాజీ సర్పంచ్ బాల్ రాజు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాయితి సాయిలు, కృష్ణ గౌడ్, భూపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.