మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 39వ వర్ధంతి

నవతెలంగాణ – చండూరు
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 39వ వర్ధంతిని చండూర్ మున్సిపల్ పట్టణకేంద్రంలోని స్థానిక సాయి దుర్గ కమర్షియల్ కాంప్లెక్స్ నందు మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించారు. మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేపల్లి భాస్కర్ సాగర్  స్వర్గీయ ఇందిరా గాంధీ గురించి  వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గండూరి నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల లింగయ్య, నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇరిగి శంకర్, పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సైదులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కట్ట అంజయ్య, సర్వేషాచారి, కర్నాటి యాదయ్య, సంగేపు సురేష్, గుంటి మధు, మల్తుర్కర్ దేవా, బొమ్మ కంటి శేఖర్, వేంపాటి సంతోష్, కల్లెట్ల రాజు, ఎర్రజల్ల నాగేంద్ర, కల్లెట్ల నాగరాజు, బుచ్చల ప్రవీణ్, పన్నాల శ్యామ్, బొమ్మకంటి భరత్ తదితరులు పాల్గొన్నారు.