మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సేవలు మరువలేనివి : కేంద్ర మంత్రి బండి సంజయ్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ అన్నారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.