ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు

నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలకే ప్రధాని పీఠాన్ని అధిరోహించారని, 508 లోక్‌సభ సీట్లకు గాను 401 సీట్లు గెలుచుకున్నారన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చారని, ఐటి కమ్యూనికేషన్‌ రంగాల ఆవశ్యకతను ముందుగానే ఊహించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శెట్టి సుధాకర్‌, రాచురి శ్రీనివాస్‌, కొమ్ముల చిన్న కనకారెడ్డి, పోలు శ్రీనివాస్‌, అన్నాడి రాజేందర్‌రెడ్డి, నంగునూరి శ్రీనివాస్‌, భైరి సుధాకర్‌, బుర్ర వెంకటస్వామి, మంద రఘుపతి, దుర్గా ప్రసాద్‌, శ్రీపాల్‌, మణిదీప్‌, శ్రీనాథ్‌, మహర్షి, తదితరులు పాల్గొన్నారు.