
మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామడొల్ల రాజేశ్వర్ అకస్మాత్తుగా గుండెపోటు తో బుదవారం మృతి చెందారు. ఇయన గతంలో మూడు పర్యాలుగా గ్రామానికి సర్పంచుగా ఎన్నికై ఎన్నో సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన బార్య రామడొల్ల సుధ సర్పంచిగా ఉండి, సర్పంచి కల పరిమితి ముగిసింది. గ్రామ అబివృద్దికి ఆయన సేవలు మరువలేనివాని గ్రామస్థులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరుగునని గ్రామస్థులు తెలిపారు.