కళ్యాణ మండపానికి మాజీ సర్పంచ్ విరాళం..

Former Sarpanch donates to Kalyana Mandapam.నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపానికి మాజీ సర్పంచ్ వేణు 5 లక్షల రూపాయల విరాళాన్ని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములకు అందజేశారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  న్యాయవాదులు  రమేష్, బిక్షపతి, సొసైటీ చైర్మన్ భూమయ్య, సంఘం సభ్యులు రామచంద్రం, నర్సింలు, ఆంజనేయులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.