చెంచులకు ప్రధానంగా విద్య, వైద్యం అందించాలి: మాజీ సర్పంచ్ గురువయ్య 

– పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచు జాతి దినదినంగా అంతరించిపోతుంది. చెంచు కుటుంబాలకు ప్రధానంగా విద్య వైద్యం అందించే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు కృషి చేయాలని అప్పాపూర్ మాజీ సర్పంచ్ గురువయ్య అన్నారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు లు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు స్టడీ టూర్ పేరుతో శుక్రవారం శనివారం రెండు రోజులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువయ్య వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, తమ పిల్లలకు విద్య అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఏకో టూరిజం పేరుతో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ చెంచులకు ఎలాంటి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు. టూరిజం హబ్ గా అభివృద్ధి చెందినప్పటికీ చెంచులకు కిందిస్థాయి పనులు మాత్రమే దొరుకుతాయని దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫారెస్ట్ ఆధ్వర్యంలో వాచర్లు టైగర్ ట్రాకర్స్ గా కొందరు పనిచేస్తున్నారు. వారికి నెల నెల జీతాలు అందగా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఐటీడీఏ పరిధిలో 220కి పైగా చెంచుపెంటలలో 13,500 చెంచు జనాభా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సలేశ్వరం జాతరను వారం రోజులు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు విద్యార్థి చేసిన పట్టించుకోలేన్నారు. నల్లమల లో పర్యటిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు చెంచులకు విద్య వైద్యం అందించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.