అంగన్వాడి టీచర్ ను వేదించిన మాజీ సర్పంచ్

– ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
నవతెలంగాణ – అచ్చంపేట
: ఉప్పునుంతల మండలం పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ శారదను వేధించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. గురువారం అచ్చంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ మహిళపై దాడులు, చిత్రహింసలు జరుగుతున్నాయి. భరించలేక  ఆత్మహత్య యత్నానికి పాల్పడిందన్నారు. దళిత మహిళలు వేధిస్తున్న సంఘటన జిల్లాలో చర్చనీయంగా మారిందన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎందుకు స్పందించడం లేదని, ప్రజా పాలనాటి ఇదేనా అని ప్రశ్నించారు.  ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ప్రగల్పాలు పలికిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎక్కడ పోయిడని అని ప్రశ్నించారు. సమావేశంలో బిఎస్పీ జిల్లా ఇన్చార్జి ఏసేఫ్, నాగన్న, తాలూకా అధ్యక్షులు కృపానందం, నాయకులు కళ్యాణ్ శేఖర్ లు ఉన్నారు.