నవ తెలంగాణ – కాటారం
భారత రాష్ట్ర సమితి కి చెందిన దామరకుంట మాజీ సర్పంచ్ కోడెల లక్ష్మీనారాయణ బి ఆర్ ఎస్ ను వీడి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో , కాటారం పార్టీ అధ్యక్షుడు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ బాసాని రఘువీర్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల చందు, నీటి సంఘం మాజీ చైర్మన్ రాంచెట్టి చంద్రయ్య, బండం బాల్ రెడ్డి ఎనగంటి తిరుపతి, సంతోషం తిరుపతి, వినీష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు