మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టు

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా మంగళవారం పోలీసులు మాజీ సర్పంచ్  లను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ  తమకు రావలసిన బిల్లులో  ఎన్నికల లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి సంవత్సర కాలం దాటిందన్నారు. అయినా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాజీ సర్పంచ్ లు తోడేటి రమేష్, బత్తిని సాయిలు, పిట్టల సంపత్, బత్తుల మల్లయ్య, గీకూరు వెంకటేశం ఉన్నారు.