ఐదు పార్టీలతో దక్షిణాఫ్రికా కొత్త ప్రభుత్వం ఏర్పాటు

ఐదు పార్టీలతో దక్షిణాఫ్రికా కొత్త ప్రభుత్వం ఏర్పాటుదక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాలో అధికారికంగా ఐదు పార్టీలతో కూడిన జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని (జీఎన్‌యూ) ఏర్పాటు చేసింది. ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని దీర్ఘకాలంగా పాలిస్తున్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) సోమవారం ప్రకటించింది. 1994లో వర్ణవివక్ష ముగిశాక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయినందున ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ గత నెలలో జరిగిన ఎన్నికలలో 40 శాతం ఓట్లను పొంది, 400 మంది సభ్యుల అసెంబ్లీలో 159 స్థానాలను గెలుచుకుంది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ మునుపటి ఎన్నికలలో గెలిచిన 230 స్థానాల సంఖ్య కుదింపుకు గురై 159 అయింది.
దీర్ఘకాల ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అలయన్స్‌ (డిఏ)తో పార్టీ ఆలస్యంగా సంకీర్ణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకుడు సిరిల్‌ రామఫోసా శుక్రవారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండవసారి విజయం సాధించాడు. రెండు చిన్న పార్టీలు – సామాజికంగా సంప్రదాయవాద ఇంకాతా ఫ్రీడమ్‌ పార్టీ (ఐఎఫ్‌పీ), రైట్‌-వింగ్‌ పేట్రియాటిక్‌ అలయన్స్‌ (పీఏ) కూడా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేతత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరాయి. దీనిని మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు చెందిన ఎమ్‌కె వర్గం ”అర్థం లేనిది, అపవిత్ర కూటమి” అని పేర్కొంది.
శ్వేతజాతి మైనారిటీ నుంచి మద్దతు పొందిన సెంటర్‌-రైట్‌ డిఏ పార్టీ మే 29 ఎన్నికల్లో 87 సీట్లు గెలుచుకుంది. ఐఎఫ్‌పీకి 17, పీఏకి తొమ్మిది, గుడ్‌ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌తో సహా ఈ సమూహం జాతీయ అసెంబ్లీలో 273 స్థానాలకు లేదా 68 శాతం ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుందని అధికార పార్టీ పేర్కొంది. కొత్త ప్రభుత్వం వేగవంతమైన, సమగ్రమైన, దీర్ఘకాలిక ఆర్థిక వద్ధి, ఉద్యోగ సష్టి, భూ సంస్కరణలు, పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివద్ధిపై దష్టి పెడుతుందని ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది.