
మండల పరిధిలోని దాచారం గ్రామంలో చేపట్టనున్న నూతన మంచినీటీ ట్యాంక్ నిర్మాణానికి సోమవారం ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కవిత, ఏఎంసీ చైర్మన్ కచ్చు చంద్రకళ, సర్పంచ్ పెంటమీదీ శ్రీనివాస్ కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 18 లక్షలు ఆర్ డభ్ల్యూఎస్ నిధులతో నూతన మంచినీటీ నిర్మాణం చేపడుతున్నట్టు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీఓ విష్ణు వర్దన్,ఆర్ డభ్ల్యూఎస్ ఏఈ రేణుకా,పంచాయతీ కార్యదర్శి సురేశ్, గ్రామస్తులు హజరయ్యారు.