
నవతెలంగాణ – రెంజల్
మండలంలోని వీరన్న గుట్ట తండా, బోర్గాం, మౌలాలి తాండ గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలకు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపనలు శారు. రూ.20 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ భవనాలను నాణ్యత లోపం లేకుండా గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి భవనాలకు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతి రెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ అందన్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబీన్ ఖాన్, సాయి రెడ్డి, జావీద్, ధనుంజయ్, సురేందర్ గౌడ్, చౌకత్, గణేష్ నాయక్, బన్షియ నాయక్ రెంజల్ సింగిల్విండో చైర్మన్ మొయినోద్దీన్, ఎమ్మెల్ రాజు, ఓ మోహన్, కార్తీక్ యాదవ్, సిద్ధ సాయిలు, బాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు.