మునుగోడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

Foundation laying of several development works in Munugodu..నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు . మునుగోడు పట్టణంలోని చౌటుప్పల్ రోడ్డు నుండి నల్గొండ రోడ్డు వరకు 14 కోట్ల వ్యయంతో ఫుట్ పాత్, సెంట్రల్ లైటింగ్, డివైడర్  తో కూడిన నాలుగు లైన్ల   రోడ్డు విస్తరణ  పనులకు , మునుగోడు నుండి నాంపల్లి రోడ్డు వరకు 10 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్,  డివైడర్ తో కూడిన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు ,మునుగోడు పట్టణంలో మూడు కోట్ల వ్యయంతో 33/11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. మునుగోడు మండల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు . ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , తాసిల్దార్ నరేందర్ , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ , మాజీ వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేపురెడ్డి సురేందర్ రెడ్డి , పాల్వాయి జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.