రూ.70 లక్షల అభివృద్ధి‌ పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-చింతపల్లి
‘మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు’ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలం బొత్యతాండలో సుమారు రూ.70 లక్షల విలువైన అభివద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్య సాగర్‌ రావు,స్థానిక సర్పంచ్‌ కొర్ర దీప్‌ లాల్‌ నాయక్‌,యం.పి.టి.సి చందు నాయక్‌, ప్రదాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్‌ రావు,ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, యస్టి సెల్‌ అధ్యక్షులు రమావత్‌ కొండల్‌ నాయక్‌,రైతు విభాగం అధ్యక్షులు మర్రు రామారావు,యస్టి సెల్‌ ఉపాధ్యక్షుడు కొర్ర లాలు నాయక్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చింతకుంట్ల విజరు,బి రాములు, బిచ్యనాయక్‌,బాల్‌ సింగ్‌ నాయక్‌,దండేటికార్‌ ప్రసాద్‌, రమావత్‌ బీమా నాయక్‌, సిమర్ల కష్ణ యాదవ్‌,దాసరి తిరుపతి,గంటెల ఆంజనేయులు,రమావత్‌ మాంత్య నాయక్‌,రమావత్‌ రాజు, కొర్ర బాసు నాయక్‌,గోవర్థన్‌,నరేష్‌, మోహాన్‌,ముని, బిచ్యనాయక్‌,బాలు, నర్సింగ్‌, శ్రీను, గణేష్‌,కొర్ర రమేష్‌, బాలాజి నాయక్‌, ఆరెకంటి మురళి,సుమన్‌ నాయక్‌, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ: మంగళవారం చింతపల్లి మండలం బొత్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్యా తండా, మనిసింగ్‌ తాండలలో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ గారు ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌ రెడ్డి, బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌ రెడ్డి,రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్య సాగర్‌ రావు,స్థానిక సర్పంచ్‌ కొర్ర దీప్‌ లాల్‌ నాయక్‌,యం.పి.టి.సి చందు నాయక్‌, ప్రదాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్‌ రావు,ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, యస్టి సెల్‌ అధ్యక్షులు రమావత్‌ కొండల్‌ నాయక్‌,రైతు విభాగం అధ్యక్షులు మర్రు రామారావు,యస్టి సెల్‌ ఉపాధ్యక్షుడు కొర్ర లాలు నాయక్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చింతకుంట్ల విజరు,బి రాములు, బిచ్యనాయక్‌,బాల్‌ సింగ్‌ నాయక్‌,దండేటికార్‌ ప్రసాద్‌, రమావత్‌ బీమా నాయక్‌, సిమర్ల కష్ణ యాదవ్‌,దాసరి తిరుపతి,గంటెల ఆంజనేయులు,రమావత్‌ మాంత్య నాయక్‌,రమావత్‌ రాజు,కొర్ర బాసు నాయక్‌,గోవర్థన్‌,నరేష్‌, మోహాన్‌,ముని, బిచ్యనాయక్‌,బాలు, నర్సింగ్‌, శ్రీను, గణేష్‌, కొర్ర రమేష్‌, బాలాజి నాయక్‌, ఆరెకంటి మురళి,సుమన్‌ నాయక్‌,యువకులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.