నాలుగు పధకాలను..నాలుగు రోజులు

Four plans..four days– 24397 దరఖాస్తులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు రోజులపాటు జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో ఎవరి చేతిలో చూసినా దరఖాస్తులు, అర్జీ లే కనిపించాయి. నిరసనలు, రసాభాసలకు కొదవే లేదు. అధికారులను నిలదీసిన ప్రజలు అనర్హుల కే పెద్దపీట వేసారు అన్న ఆరోపణల నడుమ గ్రామసభలు శుక్రవారం ముగి శాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 57,283 దరఖాస్తులు రాగా వారిలో 20 వేల మంది కూడా అర్హుల జాబితాలో పేర్లకు నోచుకోలేదు. దీంతో గ్రామ సభ లన్నీ నిరసనలతో హోరెత్తాయి. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాత్రం చోటు దక్కక పోవడంతో గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి.
గ్రామసభల్లో అందజేసిన కొత్త దరఖాస్తులు
మండలం          ఐఏబీ         ఎఫ్.ఎస్.సీ      ఐ.ఐ                    ఆర్.బి
అశ్వారావుపేట   1045       2218          2600                   75
దమ్మపేట          1500      1407        3557                   18
చండ్రుగొండ        148    1315          155                —-
అన్నపురెడ్డిపల్లి    493       1014           778                   13
ములకలపల్లి     1639      1428         2509                 217
మొత్తం             4825    9650       9599                   323
నాలుగు పధకాలకు ఆశావాహులు       మొత్తం 24397 దరఖాస్తులు అందజేసారు.