నాలుగు భిన్న ప్రేమకథలు

Four different love storiesహర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూచౌదరి హీరో, హీరోయిన్లుగా విక్రమ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. బెక్కెం వేణుగోపాల్‌, సజన్‌ కుమార్‌ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘ఇదొక యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. కామెడీ, ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది?, లవ్‌ బ్రేకప్‌ తరువాత వాళ్ల రియలైజేషన్‌ ఏమిటి అనేది సినిమా. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హదయాలకు హత్తు కుంటాయి. అందరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. దర్శకుడు రాజమౌళికి ‘స్టూడెంట్‌ నెం.1’ తొలి చిత్రమే. ఆ తరువాత ఆయన ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి అద్భుతాలు సష్టించాడు. నాకు కూడా ‘రోటి కపడా రొమాన్స్‌’ తొలి చిత్రం. ఇది నాకు ‘స్టూడెంట్‌ నెం.1’ లాంటిదే. భవిష్యత్‌లో నేను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలు తీస్తా. కానీ తొలి చిత్ర దర్శకుడిని నిలబడే ఛాన్స్‌ ఇవ్వండి. చిన్న సినిమాలకు స్పేస్‌ ఇవ్వండి. ఏ సినిమాలు లేక ఇప్పటికీ ‘అమరన్‌’ (తమిళం)సినిమానే ఇక్కడ ఆడుతుంది. మన సినిమాలను అక్కడ పట్టించుకోరు. ముందు మన సినిమాను బతికించుకోండి’ అని అన్నారు.