నవతెలంగాణ -నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ స్టేట్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం 5 రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాన్ని నడిపిన శివతాండ కు చెందిన కేతావత్. సంతోష్, మద్దేపల్లికి చెందిన ఇస్లావత్. శివరాం, పోతంగల్ కు చెందిన తోకల సంజీవ్ మరియు ముల్లంగికి చెందిన షేక్ జయినుద్దీన్ లకు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. తాగి వాహనాన్ని నడిపితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.