నాలుగో క్లాస్‌ పాస్‌..నకిలీ డిగ్రీ

– ఇది రాజు గారి పాలన
– కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేక ర్యాలీలో కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ: కేంద్రంలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆదివారం ఢిల్లీలో ర్యాలీ నిర్వహించింది.ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఈ రోజు ఢిల్లీకి ఈ ఆర్డినెన్స్‌ వచ్చింది, రేపు ఇతర రాష్ట్రాలకూ వస్తుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ను తరిమికొట్టేందుకు రాంలీలా మైదాన్‌కు వచ్చాం.అని చెప్పారు.
,సుప్రీంకోర్టుపై నాకు నమ్మకం లేదని దేశ ప్రధాని అంటున్నారు. అతనికి అహం ఎక్కువ. దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోంది. దీన్ని నియంతృత్వం, హిట్లర్‌షాహి అంటారు,.అని వివరించారు.
ఈ ఐదు అంశాలే కేజ్రీవాల్‌ టార్గెట్‌.
ద్రవ్యోల్బణంపై..
కేజ్రీవాల్‌ తన ప్రసంగంలో ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పెట్రోలు, పాలు, కూరగాయలు ఖరీదైపోయాయి. ఎల్పీజీ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.1,000 దాటింది. దీన్ని ఎలా నియంత్రించాలో వారికి అర్థం కావడం లేదు. నాలుగో క్లాస్‌ పాస్‌ రాజుకి దేశాన్ని ఎలా నడిపించాలో కూడా తెలియదు.
ఏదో ఒకరోజు రూ.2000 నోటు వస్తుందని అంటున్నారని, ఐదేండ్ల తర్వాత అది పోతుందని చెప్పారు.
రాజుకు మిత్రుడైన నాయకుడు రైతులపై బండి నడిపినా, పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయారు. రాజు ఏమాత్రం పశ్చాత్తాపమూ లేకుండా తన అహంభావంలో జీవిస్తున్నారని విమర్శించారు.
రాజుకు మరొక స్నేహితుడు ఉన్నాడు, అతను దేశంలోని అంతర్జాతీయ మహిళా మల్లయోధులతో అనుచితంగా ప్రవర్తిస్తాడు, కానీ రాజు దాని గురించి ఏమీ మాట్లాడరు. రాజుకు అతనితో ఉన్న స్నేహం విడదీయలేనిదని చురకలు అంటించారు.మరో స్నేహితుడికి
విమానాశ్రయం, భూమి, గనులు అన్నీ రాసి ఇచ్చారని విమర్శించారు..
పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషి, సంజరు సింగ్‌ సహా పలువురు ఆప్‌ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.