ఐటిఐలో నాలుగో దశ అడ్మిషన్లు..

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ లలో మిగిలన సీట్ల కొరకు ఈ నెల  20 వరకు స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐ ల కన్వీనర్,  ఎ. నర్సింహ్మ చారి సోమవారం  ఒక ప్రకటనలో తెలపారు. సూచించిన తేదీ లోగా ఉదయం 11 గంటల వరకు iti.telangana.gov.in  వెబ్ సై ట్ లో వివరాలను న మోదు చేసుకోవాలని పేర్కొన్నారు.  ఇప్పటికే 1, 2, 3 ఫేజ్ లలో నమోదు చేసుకున్న వారు నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.నమోదు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ప్రింటెడ్ కాపీ తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో భౌతికంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఐటిఐ కళాశాలలో ఈ నెల 11 నుండి 20వ తేదీలోగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు హాజరై అడ్మిషన్లను పొందాలని తెలిపారు. మరినీ వివరాలకు 9948947670, 970111928 2 ను సంప్రదించాలని పేర్కొన్నారు.  1,2, 3 ఫేజ్ లలో సీటు కేటాయించ బడిన అభ్యర్థులకు ప్రస్తుతం అవకాశం ఉండదని తెలిపారు.