బాల సాహిత్యం మనసుకు అద్దం వంటిది. ఈ అద్దంలో వారికి కనిపించే ప్రతిబింబాలు కథలు, వాటి పాత్రలు. బాల సాహిత్యం చిన్నారుల మనసుకు విత్తనాలు నాటే తోట వంటిది కూడా. ఈ తోటలో ప్రతి కథ ఒక విత్తనం… అందులోని పాత్రలు మనకు అద్భుతమైన మొక్కలను చూపిస్తాయి. ఈ కథ్లలోని పాత్రలు పిల్లల మనసుల్లో అనేక విలువలు భావనలు నాటి, వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చక్కటి కథలోని పాత్రలు పిల్లలను అనేక విలువలను నైతికతను జీవితం పట్ల సానుకూల దక్పథాన్ని పెంపొందిస్తాయి. ఈ కథలు రచించిన పుప్పాల కష్ణమూర్తి తెలుగు సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కథా రచయిత. ఈ కథలతో పిల్లలలో దేశభక్తి, మానవతా విలువలు, సమాజ చైతన్యం వంటి గొప్ప లక్షణాలను పెంపొందించే అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఈ భారతవనంలో భావి భారత పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి కావలసిన నైతిక, సామాజిక, సాంస్కతిక విలువలను తన కలంతో భారతావనంలో బాటలు వేశారు. ఈ సంకలనంలోని ‘పుల్లమ్మ చల్ల’/ తాగినవారికల్ల/ కవిత్వం కొల్ల”. కడుపులో చల్ల పడగానే కవిత్వం వెల్లువలా వచ్చిందంటారు. ఈ కథ గ్రామీణ మహిళా జీవితాలను వారి సంకల్ప శక్తిని తెలియజేస్తుంది. ‘అరణ్యంలో ప్రజాస్వామ్యం’ కథలో సింహ రాజునుండి అడవిలో ప్రజాస్వామ్యం వస్తుందని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి, అన్ని జంతువులకు ఓటు హక్కు కల్పిస్తుందని, ఎన్నికలు నిర్వహిస్తుందని, మెజారిటీ కలిగిన తమకు రాజ్యాధికారం వస్తుందని, నిత్యం క్రూర జంతువులకు బలవుతూ ఆశగా అడివిలో ఎదురు చూస్తున్నాయి సాత్విక జీవులు. ప్రకతితో మానవుని సంబంధాన్ని ప్రజాస్వామ్య విలువలను తెలియజేస్తుంది ఈ ఆసక్తికరమైన కథ. ‘దేశభక్తుడు’ కథలో ‘పరిగతోటి గుమ్మి నిండదు, కల్లుతోటి కడుపు నిండదు’ అనే సామెత చెప్పి పాలకులు ఇచ్చేటి ఉచిత హామీలు ప్రజలకు హాని కలిగిస్తాయని, కష్టాన్ని వదిలేసి ఉచితలకు ఆశపడితే దేశభక్తి పూర్తిగా తొలగిపోతుందని, నిజమైన దేశభక్తుడి ఆవేదనను వ్యక్తపరిచారు. దేశభక్తి అంటే ఏమిటో అనే దానిపై పిల్లలకు అవగాహన కల్పించే కథ. ‘నిర్మల హదయం’ కథలో మనం చేసే చేసే సహాయం ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలని, సాధు జంతువుల పట్ల ప్రేమ చూపాలని నిర్మలమైన హదయముతో జీవన గమనాన్ని కొనసాగించాలని, మానవత్వం నిస్వార్థం గురించి చక్కగా వివరించారు. ‘పరిమళించే మంచితనం’లో ఎదుటి వాడి సొమ్మును ఎలా కొట్టేయాలని ఆలోచించే ఈ కాలంలో జాలరి తన సర్వస్వం పరుల మేలు కోసం ధారపోస్తాడు. ఇలాంటి వాడు రాజ్యంలో ఉన్నందుకు రాజు గర్వపడతాడు. దివ్యమైన ఆలోచనలు ఉన్న జాలరి వల్ల అభాగ్యులు, అనార్థులు ఆకలి తీర్పుకుంటున్నారు. ఆ జాలరిలో మంత్రి గారికి ఒక యోగి కనిపిస్తాడు. మంచి మనసున్న వ్యక్తుల ప్రభావం గురించి ఈ కథలో వివరించారు పుప్పాల. ‘పసి హదయం’లో పిల్లలకు చెట్ల పట్ల, పక్షుల పట్ల ప్రకతి పట్ల ఉన్న ఆలోచనలు, వారి ప్రపంచం గురించి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన పర్యావరణాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది. ‘జంతు ప్రేమ’ వంటి కథలు వివిధ అంశాలను తమలో ఇమిడ్చుకుని, చిన్నారుల మనసులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కథలు చిన్నారులకు సమాజంలోని విలువలను, మంచి చెడులను, సత్య సంధతను బోధిస్తాయి. పిల్లలకు అర్థమయ్యే సరళమైన భాషలో రాసిన ఈ కథలు, వారిలో నీతిని బోధిస్తూ, పఠనాభిరుచిని, మంచి విలువలను పెంపొందిస్తాయి. వివిధ అంశాలను తమలో ఇమిడ్చుకుని, పిల్లల ఆలోచనా విధానాన్ని విస్తరిస్తాయి. కొన్ని కథలు సమాజంలోని వివిధ అంశాలను ప్రతిబింబిస్తూ, పిల్లలలో సామాజిక చైతన్యం కలిగిస్తాయి. ‘భారతవనం’ కథా సంకలనం చిన్నారులకు అమూల్యమైన నిధి. ఈ కథలను ఆస్వాదిస్తూ, వాటి నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలకు తప్పకుండా చదివించవలసిన అద్భుతమైన పుస్తకమిది. ఉప్పాల గత మూడు దశాబ్దాల కాలంగా కథా రచయితగా కొనసాగుతూ పిల్లల కథలతో పాటు పిల్లల నవలలు కూడా రచించారు. 17కి పైగా కథల పుస్తకాలు తెచ్చారు. బాల సాహిత్యంలో పుప్పాల కషికి గాను 2016 వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారి నుండి శ్రీ అంగల కుదుటి సుందరాచారి స్మారక కీర్తి పురస్కారం, 2020లో బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. పుప్పాల సాహిత్యంపై కాకతీయ యూనివర్సిటీలో అనిత అనే విద్యార్థి పీ.హె.చ్.డి. చేస్తుంది. ఈ సంకలనానికి ముందు మాట అందించిన డా|| వాసిరెడ్డి రమేష్ బాబు నిపుణత కలిగిన బాల సాహిత్య అక్షర శిల్పి పుప్పాల కష్ణమూర్తి అని కొనియాడారు. ముఖచిత్రంతో పాటు లోపలి బొమ్మలతో భాస్కరం ఈ పుస్తకానికి అందాన్ని తెచ్చారు. బాలసాహిత్యం వ్యాప్తిలో పుప్పాల సహచరుడుగా డా|| బెల్లంకొండ రాజశేఖర్, ప్రశాంతి సహకారం అభినందనీయం.
– పూసపాటి వేదాద్రి, 9912197694