న్యూఢిల్లీ : వ్యవసాయ వస్తువుల వ్యాపారంలో ఉన్న ఫ్రాంక్లిన్ ఇండిస్టీస్ లిమిటెడ్ కొత్తగా కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రటించింది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ గుజరాత్ కంపెనీ పేర్కొంది. తమ వ్యూహాత్మక విస్తరణ మార్కెట్ స్థితిని బలోపేతం చేయడమే కాకుండా వృద్థి, లాభదాయకత కోసం కొత్త మార్గాలను సృష్టించడం ద్వారా తమ వాటాదారులకు విలువను జోడించాలని నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది.