– డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడుల్లో పట్టివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అక్రమార్కులు ధనార్జన కోసం ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. మహిళలకు ఇబ్బంది కలిగిన రుతుక్రమ రుగ్మతలను తగ్గించే పేరుతో తప్పుడు ప్రకట నలిస్తూ కొలినల్ -స్పాస్ టాబ్లెట్స్‌ను అమ్ముతున్నట్టు కామారెడ్డిలో గుర్తించారు. వీటిని అక్కడి కోణార్క్ పంపిణీ దారులు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్దేశించిన ధర కన్నా డెక్సామెథసోన్ ఉత్పత్తిని అమ్ముతున్నట్టు గుర్తించారు. దీని నిర్దేశిత ధర రూ.26.7 (30 ఎంఎల్)కు కాగా సీలింగ్ ప్రైజ్‌కు జీఎస్టీ కలిపినా రూ.29.904 కన్నా ఎక్కువకు అమ్మడానికి వీల్లేదు. కానీ దీన్ని రూ.39.90కు లేబుల్ పెట్టి అమ్ముతున్నారు. దీని తయారీ దారు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లాబోరేట్ ఫార్మాస్యూటికల్స్ ఇండియా లిమిటెడ్ ఫుడ్ లైసెన్స్ పేరుతో థైంప్ – 100 టాబ్లెట్స్ (థైమైన్ హైడ్రో క్లోరైడ్ టాబ్లెట్స్ 100 ఎంజీ) మార్కెట్ లోకి పంపిణీ చేస్తున్నట్టు కుత్బుల్లాపూర్ జోన్లో గుర్తించారు. మల్కాజిగిరి వసంతపురి కాలనీ, శ్రీ అనుక్రిష్ణ ఫార్మసీలో దాడి చేయగా ఇవి బయటపడ్డాయి. ఇలాంటి నకిలీ మందుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ వీ.బీ.కమలాసన్ రెడ్డి సూచించారు.