మద్నూర్ వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోళ్లలో రైతులకు మోసాలు..

– ఇక్కడ కమిషన్ ఏజెంట్లదే హవా
– సీసీఐ ధర కంటే 300 రూపాయలు తక్కువగా కొనుగోలు
– సీసీ అధికారులు పట్టించుకోరు మార్కెట్ అధికారులు పత్తి బీట్లపై నిగా పెట్టరు
– సమయపాలన లేకుండా బీట్ల సమయం కంటే ముందే పత్తి వాహనాలు ఖాళీ
– మార్కెట్ తక్ పట్టీలు కరువు చిత్తు కాగితాలే రసీదులు,
– రైతు మోసాలపై పత్తి ఖరీదు దారులకు, కమిషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేస్తాం, ఏఎంసీ సెక్రెటరీ
నవతెలంగాణ- మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల్లో  తెల్ల బంగారం కొనుగోళ్లకు ప్రఖ్యాత గాంచిన మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లలో రైతులకు భారీగా మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మద్దతు ధర కంటే ప్రైవేట్ ధర క్వింటాలుకు 300 రూపాయలు తక్కువగా కొనుగోలు జరుగుతున్నాయి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 7020 రూపాయలు ఉండగా ప్రయివేట్ పత్తి ధర క్వింటాలుకు 6600 నుండి 6,725 పలుకుతుంది దీనిని బట్టి చూస్తే ప్రతి క్వింటాలుకు పత్తి రైతు 300 రూపాయలు ధరల్లో మోసపోతుంటే ఇక అడత్ అమాలి పేరుతో మరో 100 నుండి 150 రూపాయలు మోసపోవలసి వస్తుంది దీనికి కారణం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో గల కమిషన్ ఏజెంట్ల హవా కొనసాగుతుంది. పత్తి కొనుగోలు ప్రతిరోజు ఉదయం మార్కెట్ పరిధిలో బీట్లు జరగవలసి ఉండగా బీట్ల కంటే ముందుగానే కమిషన్ ఏజెంట్లు పత్తి వాహనాలకు రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తూ పత్తి మిల్లుల కరిదారులతో కుమ్మక్కై  ఖరీదారులతో  ధరల్లో క్వింటాలుకు 50 రూపాయలు వంద రూపాయలు తేడా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.  వీటితోపాటు హడత్ హామాలిలో అధిక ధరలు మార్కెట్ తక్ పట్టీలు ఇవ్వకుండా చిత్తు కాగితాల పైన పత్తి వ్యాపారాలు కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నాడు నవ తెలంగాణ పత్తి కొనుగోళ్లపై పరిశీలన జరపగా పత్తి బీట్ల కంటే ముందుగానే కమిషన్ ఏజెంట్లు రోడ్లపైనే వ్యాపారాలు జరుపుతూ.. పత్తి మిల్లుల ఖరీదారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి పత్తి మిల్లులో భారీ మొత్తంలో పత్తి వాహనాలు ఖాళీ అయ్యే దృశ్యాలు కనిపించాయి. ఇక సిసిఐ కొనుగోలు జరుగుతున్నప్పటికీ నామమాత్రంగానే అధికారులు కొనుగోలు చేపడుతున్నారు. వాటిలో కూడా కమిషన్ ఏజెంట్ల దే హావా కొనసాగుతున్నట్లు సమాచారం ఇప్పటివరకు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ప్రైవేటు కొనుగోలు దాదాపు 80 వేల క్వింటాళ్లు కొనుగోలు జరిగినట్లు అధికారుల అంచనాలు చూపిస్తున్నాయి. కాగా సీసీఐ కొనుగోలు దాదాపు 30 వేల క్వింటాళ్లు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. కమిషన్ ఏజెంటు లేనిదే పత్తి అమ్మకాలు జరగడం లేదనే ఆరోపణలు వెళ్ళు వెత్తుతున్నాయి. తెల్ల బంగారం వ్యాపారంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో జరిగే పత్తి రైతు మోసాలపై నవ తెలంగాణ మార్కెట్ కమిటీ కార్యదర్శి విట్టల్ ను వివరణ కోరగా మద్నూర్ మార్కెట్ పరిధిలో రైతు మోసాలపై పత్రిక పరంగా తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తపరిచారు. రైతు మోసాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని వెంటనే పత్తి ఖరీదారులకు కమిషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేస్తామని వివరణ ఇచ్చారు.