– గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ కమిషనర్ శరత్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎస్టీ అభ్యర్ధులకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో మెయిన్స్‌కు సన్నద్ధమయ్యేందుకు మెంటార్ గైడెన్స్‌తో పాటు, ఒక ట్యాబ్, ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు. అర్హులైన ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వారు యూపీఎస్సీ – ీఎస్సీ – ప్రిలిమినరీ పరీక్ష 2024 నందు ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382620487, 7093466985 సంప్రదించాలని సూచించారు.