పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు

నవతెలంగాణ – మాక్లూర్

మండలంలోని మదన్ పల్లి, మదన్ పల్లి తండా గ్రామాల్లో 467 పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశు వైద్యులు డా. కిరణ్ దేశ్ పాండే బుదవారం తెలిపారు. పశువుల యజమానులు తప్పకుండా తమ పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసించలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్ గౌడ్, ఎంపిటిసి ఒడెన్న, వైద్యురాలు ఉమమ సహేర్ వాస్, పశువైద్య సిబ్బంది విఎల్ఓ టి. వినీత, జేవిఓ గంగజమున, విఏ పాషా, ఆఫీస్ సబార్డినేట్స్ శ్రీనివాస్, సజ్జత్, గోపాల మిత్రులు బేగ్, దిలీప్ పాల్గొన్నారు.