నీట్‌ పై బాలికలకు ఉచిత అవగాహనా తరగతులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీట్‌ – 2025 కు సిద్ధపడుతున్న బాలికలకు ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు మెటామైండ్‌ అకాడమీ (హైదరాబాద్‌) తెలిపింది. ఈ మేరకు ఆదివారం అకాడమీ చైర్మెన్‌ ఎ.మనోజ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 25, 26, 27 తేదీల్లో ఉచిత హాస్టల్‌ వసతితో నిర్వహించే తరగతుల్లో నీట్‌ లో ఎదురయ్యే సవాళ్లు, మొదటి ప్రయత్నంలోనే నీట్‌ ఎలా సాధించాలి తదితర విషయాలపై మెడికోలు, సీనియర్‌ అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. మొదట రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 100 మందికి మాత్రమే ఈ అవకాశముందని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన వారు 89199 26339లో సంప్రదించాలని సూచించారు.