నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూపీఎస్సీ-2025లో నిర్వహించే సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆప్షనల్ ఎంపికపై ఆదివారం నుంచి ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తున్నట్టు క్రిష్ణప్రదీప్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అకాడమి చైర్మెప్ క్రిష్ణప్రదీప్ శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఆదివారం నుంచి వచ్చేనెల ఆరో తేదీ వరకు ఏడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. సివిల్స్ ర్యాంకు సాధనలో ఆప్షనల్ ఎంపిక కీలకమని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆప్షనల్ సబ్జెక్టులపై నిపుణులతో అవగాహన కల్పిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను 9133517733 నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.