కలిగోట్ లో ఉచిత ఆయుర్వేద శిబిరం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

మండలంలోని కలిగొట్ గ్రామంలో ఉచిత ఆయుర్వేద శిబిరము నిర్వహించినట్లు డాక్టర్ లలిత శనివారం తెలిపారు. గ్రామంలోని ప్రజలందరికీ గ్రామపంచాయతీ ఆవరణలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ లలిత మాట్లాడుతూ ఆయుర్వేదంలో అన్ని రకాల రోగాలకు మందులు ఉన్నాయని ఆయుర్వేదం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. బిపి, షుగర్, బహిష్టు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు ,అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో చికిత్స ఉన్నదని తెలియజేశారు కార్యక్రమంలో చేతన విజయ రెడ్డి ఎంపీటీసీ జయగిరిధర్ గౌడ్, ఫార్మసిస్టులు ఏఎన్ఎం ,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు