నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ మైనారిటీల సంక్షేమ శాఖ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరిక్షలు గ్రూప్ -1 ప్రిలిమ్స్, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 పరిక్షల కోసం కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పోటీ పరిక్షలు , రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పోటీ పరీక్షలు బ్యాంకింగ్ మొదలగు పోటీ పరీక్షల కొరకు సన్నద్దమవుతున్న మైనారిటీస్ అభ్యర్థులకు జిల్లాలో ఉచిత బేసిక్ ఫౌండేషన్ శిక్షణ అంందించనున్నామని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికాణి కృష్ణవేణి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వార డిగ్రీ పూర్తి చేసుకున్న మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఉచిత శిక్షణ 4 నెలలు ఇవ్వబడునని తెలిపారు. కావున అర్హత, ఆసక్తి కలిగిన మైనారిటీస్ అభ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు బౌద్దులు, జైనులు, పార్సికులు) తమ దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ద్రువీకరణ పత్రం,కుల దృవీకరణ పత్రం, డిగ్రీ మార్క్స్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు(2) జనవరి-16 వ తేదీ లోపు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరములకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము, నిజామాబాద్ జిల్లా, కొత్త కలెక్ట్ రేట్ 2వ అంతస్తు రూమ్ నెం.221 ఫోన్ నెం: 9700351786 కు సంప్రదించాలన్నారు. అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటీస్ విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికాణి కృష్ణ వేణి తెలిపారు.