ఏఎమ్మార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత బస్సు

– ప్రారంభించిన మాజీ ఎంపీపీ మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఉచిత బస్సును బుధవారం మండల తాజా మాజి ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్క భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మలహాల్ రావు మాట్లాడారు విద్యార్థులకు దూరబారం ఉన్నందున సిఎస్సార్ నిధుల నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇటీవల కొరినట్లుగా తెలిపారు.బస్సు సౌకర్యం ఏర్పాటు పై ఏఎమ్మార్ యాజమాన్యానికి  ఉపాధ్యాయ,తల్లిదండ్రుల,పిల్లల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.