కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

– మద్దాల నాగమణి  మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు
నవతెలంగాణ-గోవిందరావుపేట : ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేటి నుండి ప్రారంభం కావడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మద్దాల నాగమణి అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం బస్సును కొబ్బరికాయ కొట్టి పూజతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రారంభం అయింది కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. క్రమక్రమంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని కార్యక్రమాలను అమలు పరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య  జిల్లా యూత్ ఊపా ద్యక్చుడు పెండెం శ్రీకాంత్ ,జిల్లా నాయకులు కణత ల నాగేందర్ గారు,సర్పంచ్ లక్ష్మి జో గా నాయక్ ,జంపాల చంద్రశేఖర్  , రెగుల లక్ష్మణ్ గ ,జిల్లా కార్యదర్శి సూది రెడ్డి జయమ్మ ,మరియు జిల్లా నాయకులు ,మండల నాయకులు గ్రామ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు.ప్రయాణికులు పాల్గొన్నారు.