ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు సంతోషంగా ఉంది…

నవతెలంగాణ – ఆర్మూర్   

   సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణా పథకాన్ని మహిళలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన  పట్టణంలోని బస్టాండ్ లో సోమవారం  ఉచిత బస్సు ప్రయాణా పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం అమలు జరిపినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ల లో  ఆదాయం పెరిగిందని అన్నారు  రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మగవారికి ఇబ్బందులు కలుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందని ఆ విషయాన్ని క్యాబినెట్ మీటింగ్ లో చర్చించడం జరిగిందని త్వరలోనే అదనపు బస్సులు ఆర్టీసీలోకి వస్తాయని ఆ సమస్య త్వరలోనే సమసిపోతుందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే ఇంత త్వరగా పథకాన్ని అమలు చేస్తారని మహిళలు అనుకోలేదని అన్నారు  అలాగే ఆర్టీసీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే ఆర్టీసీ కి సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉంటే నోటీసులు జారీ చేసి వసూలు చేస్తామని అన్నారు.  అలాగే ఆరు గ్యారెంటీలకు సంబంధించి 28వ తారీకు నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ సభల్లో, వార్డు సభల్లో మీ దగ్గరికి వచ్చే అధికారులకు నాలుగు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల  సునీల్ రెడ్డి , మాజి నిజాం సాగర్ కెనాల్ చైర్మన్ యల్లా సాయిరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సాపల్లి జీవన్ , వెంకటేష్ రావ్ పటేల్ ,చుక్క శ్రీనివాస్ ,  పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ,నందిపేట్ మండల అధ్యక్షులు మంద మహిపాల్  ఫాయీమ్ ,మురళి ,అజ్జు , కోల వెంకటేష్ ,జిమ్మీ రవి , నూతపల్లి గంగా రెడ్డి ,పిప్రి సాయిరెడ్డి  మహమూద్ ,హాబీబ్ , బాలకిషన్ , నియోజకవర్గ నాయకులు కర్యకర్తలు పాల్గొన్నారు.