
జిల్లా న్యాయసేవా అధికార సంస్థ నిజామాబాద్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్) నిజామాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న
అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అనాథ బాలికలకు ఉచిత క్యాన్సర్ నిరోధక టీకా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. బాల సదన్ కు చెందిన 14 మంది అనాధ అమ్మాయిలకు ఉచితంగా క్యాన్సర్ నిరోధక టీకాలను ఇప్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ప్రద్యుమ్న రెడ్డి డాక్టర్ చైతన్య డిఎల్ఎఫ్ బాలసదన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.