నవతెలంగాణ – పాల్వంచ
పుట్టుకతోనే గుండె జబ్బు సమస్యలతో బాధపడే చిన్నారులకు, యూకేలో స్థిరపడిన డాక్టర్ ల బృందం అధ్వర్యంలో మరియు నిమ్స్ భాగ స్వామ్యంతో ఈ నెల 22 నుండి 28 వరకుచిన్న పిల్లలకు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న ఉచిత శస్త్ర చికిత్సా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శనివారం నాడు ఒక ప్రకటనలో తేలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో గుండెకు రంధ్రం, గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులు ఉచితంగా చికిత్స పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. తల్లి తండ్రులు తమ పిల్లల పూర్వ రిపోర్టులతో రావాలని సూచించారు. ఇతర వివరాలకు 040-23489025 కు సంప్రదించాలని కోరారు.