గాంధారి మండలంలోని చర్మల్ గ్రామంలో ఉచిత పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. 2 పశువులకు కృత్రిమ గర్భధారణ, 5 పశువులకు సాధారణ చికిత్సలు చేశారు. 22 పశువులకు నట్టల నివారిణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రవి, గోపాలమిత్ర రాములు తదితరులు పాల్గొన్నారు.