
తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గోపాలమిత్ర సెంటర్ పెద్దతండ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత గర్భగోష వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా గర్భం దాల్చని పశువులను గుర్తించి తగిన చికిత్స నిర్వహించారు. ఎదలో ఉన్న వాటికి కృత్రిమ గర్భధారణ చేశారు. చూడి పరీక్షలు నిర్వహించి మేలు జాతి దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి, దూడలకు నటల నివారణ మందులు, క్యాల్షియం టానిక్ లను అందజేశారు. రైతుల కృత్రిమ గర్భధారణ మేలు జాతి పాడి పశువుల పై అవగాహన కల్పించారు. విటమిన్ ఇంజక్షన్లు ఇచ్చారు. పాల దిగుబడిని పెంచే ఖనిజ లవణ మిశ్రమాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వి ఏ ఎస్ డాక్టర్ రామచంద్రారెడ్డి ,డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ సునీత, సూపర్వైజర్ భానుచందర్, పశు వైద్య సిబ్బంది ఎల్ ఎస్ ఏ శేఖర్, రవి, విఏలు రాఘవేంద్ర, శంషాద్దీన్ గోపాలమిత్రలు వీరు, బాలేష్, హర్ష మహేష్, పి ప్రవీణ్ ,కె ప్రవీణ్ ,గ్రామ రైతులు పాల్గొన్నారు.