పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్‌, వసతి కల్పించాలి

Free coaching and accommodation should be provided for competitive exams– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, వసతి కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్య దర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రూప్‌-1,2,3 రాత పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించిందని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలైందని అన్నారు.గత ప్రభుత్వం నోటిఫికేషన్లను ఇచ్చిన ప్పటికీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల అవి రద్దయ్యాయని విమర్శించారు. ఇప్పటికే కొన్నేండ్లుగా నిరుద్యోగులు ఫీజులు కట్టి కోచింగ్‌ తీసు కుంటున్నా రని చెప్పారు.మరింత కాలం చదవాల్సిన అవసర ముందన్నారు.పేద,మధ్యతరగతి నిరుద్యోగ యువకు లు కోచింగ్‌ కోసం ఫీజులు కట్టడానికి, వసతి ఏర్పాటుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అప్పులు చేసి చదువు కుంటున్నార ని అన్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందన్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు సన్నద్ధమవుతున్నారని వివ రించారు. వారి కోసం ప్రతి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వసతి కల్పించాల ని కోరారు.ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయాల నీ,ప్రయివేట్‌ కోచింగ్‌ కేంద్రాల ఫీజుల దోపిడిని అరికట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు.