స్వర్ణగిరి దేవాలయంలో వికలాంగులకు ఉచిత దర్శన సౌకర్యం

– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విజ్ఞప్తి
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని స్వర్ణ గిరి దేవాలయంలో వికలాంగులకు ఉచిత దర్శనము కల్పించాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకులను కోరారు. దేవాలయం ఆఫీస్ వద్ద వికలాంగుల కోసం వీల్ చైల్డ్ ఏర్పాటు చేశారు. గుడి లోపలికి పోవడానికి ర్యాంప్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు అందువల్ల వీల్ చైర్ను ఉపయోగించుకొని వికలాంగులు గుడి లోపలికి పోలేకపోతున్నారని ఆయన అన్నారు. స్వర్ణ గిరి దేవాలయంలో వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను ఆదుకునే యాజమాన్యం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత జిల్లా నాయకులు మురళి నాయక్ పాల్గొన్నారు.