
నవతెలంగాణ – కంటేశ్వర్
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్,తెలంగాణ మల్టీ స్పెషాలిటి డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆద్వర్యంలో శనివారం నిజామాబాదు నగరంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి ఫేస్టులు అందజేశారు. దంతాల విషయంలో అజాగ్రత్త పనికి రాదని డాక్టర్ రాజశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలన్నారు. దంత సమస్యలు ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ ను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జిల్కర్ విజయానంద్,చింతల గంగాదాస్,ప్రోగ్రామ్ చైర్మెన్ అబ్బాయి లింబాద్రి,శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత,పాఠశాల ప్రభందకారిణి కమిటీ సభ్యులు సుదర్శన్ పాల్గొన్నారు.