ఉచిత దంత వైద్య శిబిరం

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరిలోని గాయత్రి జూనియర్ కళాశాలలో సంధ్య డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో డా.సుదీర్ రెడ్డి  సహకారంతో ఉచితదంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ సింగన బోయిన మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మానవునికి సోకే అన్నీ రోగాలకు కారణం దంతాలు కాబట్టి దంతాలను రక్షించుకుంటే అన్ని రక్షించుకువచ్చ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో  డా సంధ్య రాణి, డా. సుదీర్ రెడ్డి. విజయ్ శిరీష. కర్తల శ్రీనివాస్  పాల్గొన్నారు.