
భువనగిరి మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఆదివారం రోజున ఆర్సీపీ యూత్, సంధ్యా డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఉచిత దంతా వైద్య శిబిరాన్ని సురుపంగ చందు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రజలు దంత వైద్య శిబిరంలో పాల్గొని వారి వారి దంత సమస్యలను డాక్టర్ సుధీర్ రెడ్డికి తెలియజేశారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ ట్యాబ్లెట్లు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్తల శ్రీనివాస్, ఎడమ పెంటయ్య, కొండోజు జంగాచారి, శ్రీనివాస్ చారి, భువనగిరి ఉపేందర్, కొండోజు సాయి, చింతల శ్రీశైలం, ఉగ్గి దుర్గాప్రసాద్, సిరికొండ తేజ, దొమ్మాటి ఉదయ్, నవీన్, దినేష్, రోహిత్, అజయ్, అనిల్, ఉదయ్, వినయ్ లు పాల్గొన్నారు.