కూనూరులో ఉచిత దంత వైద్య శిబిరం

నవతెలంగాణ – భువనగిరి
మండలంలోని కునూరు గ్రామంలో సంధ్య డెంటల్ క్లినిక్, ఆ గ్రామ ఎంపీటీసీ పాశం శివనందు ఆధ్వర్యంలో  ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా,  ముఖ్య అతిథిగా భువనగిరి రూరల్ ఎస్సై వి సంతోష్ కుమార్ హాజరై,  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పాశం శివానంద్ మాట్లాడుతూ దంత సంరక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమని తెలిపారు. ఎస్ఐ సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. యువ ప్రజా ప్రతినిధులు ఎన్నికైనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతారని వారికి సందర్భంగా తెలిపారు. డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించగా సుమారు 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, బ్రెష్,  పేస్టు ఉచితంగా అందజేశారు. ఈ  కార్యక్రమంలో ఎస్సై శివనాగప్రసాద్, కర్తాల శ్రీనివాస్, గోపి సుధాకర్, గుండ్ల శ్రీనివాస్, డోకే బాలకృష్ణ లు పాల్గొన్నారు.