నవతెలంగాణ – కంటేశ్వర్
ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మా పాఠశాలలో జి ఆర్ ఎం సొసైటీ, ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆధ్వర్యంలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం అని ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం మామిడాల మోహన్ శుక్రవారం తెలియజేశారు. మీలో ఎవరికైనా ఈ సమస్యలున్నట్లయితే ప్రముఖ డాక్టర్లు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్ డాక్టర్ అలేఖ్య (తెలంగాణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల మున్సిపల్ కాంప్లెక్స్ ఖలీల్ వాడి) దంత సమస్యల కు సంబంధించిన పరిశీలన చేస్తారు. అలాగే డాక్టర్ ప్రజ్ఞా వల్లూరు (అయ్యప్ప కంటి ఆసుపత్రి, పోచమ్మ గుడి రోడ్డు, అంగడి బజార్) కంటికి సంబంధించిన సమస్యల పట్ల పరిశీలన చేస్తారు. ఏవైనా దంత లేదా కంటి సమస్యలు ఉన్నట్లయితే వారికి ట్రీట్మెంట్ అవసరమైనట్టయితే ఆ డాక్టర్లు ప్రత్యేకమైనటువంటి రాయితీతో మీకు వారి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తారు. మీ ఇంట్లో చిన్న, పెద్ద, ఎవరికీ సమస్య ఉన్నా ఈ అవకాశాన్ని రేపు ఉదయం 9 గంటల నుండి మా పాఠశాలలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు.