
మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ వైద్యులు డా. ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ ఎండి హఫీజ్ సహకారంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు. తలమక్కి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో బుధవారం రోజు సంజీవని హాస్పటల్ లో ఉచిత డయాబెటిక్, ఉచిత రక్త మూత్ర పరీక్షలు235 మందికి నిర్వహించినట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు తలామక్కి రవీందర్ శెట్టి వివరించారు. 185 మందికి షుగర్ పరీక్షలు45 మందికి రక్త మూత్ర .పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్. రవీందర్ శెట్టి, సెక్రెటరీ లయన్ ఎండి ముజాహిద్,, ట్రెజరర్ లయన్ కట్ట రమేష్. విపి.(1) లయన్ ఇప్ప మల్లేశం, లయన్ ఎండి హఫీజ్, లయన్ విట్ట రవి, లయన్ అక్కనపల్లి చంద్రయ్య, లయన్ మహిపాల్ రెడ్డి, ఉచిత డయాబెటిక్ క్యాంపుకు భారీగా తరలివచ్చిన పేషెంట్లు, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.