ఉచితంగా ఆవు పాలు పంపిణీ 

Free distribution of cow's milkనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్ చౌరస్తా వద్ద ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాలు పంపిణీ కేంద్రం నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇందూరు భూ సేవ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ఆవుపాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇందూర్ గోసేవ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, శ్రీకాంత్, శివన్, సుమన్, సందీప్, సాయి, తదితరులు పాల్గొన్నారు.