
మండలం లోని తుంగతుర్తి ప్రాథమిక పాఠశాల లో చదివిన పూర్వపు విద్యార్ది జానపాటి సతీష్ కుమార్ ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్యార్థులకు బెల్ట్, టై,ఐడికార్డ్, స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూస్ ఉచితంగా విద్యార్థులకు బహుకరించారు.వాటిని మండల విద్యాధికారి తరి రాము విద్యార్థులకు శనివారం అందజేశారు.
తుంగతుర్తి ప్రధానోపాధ్యాయులు సహకారం మండల విద్యాధికారి చెప్పగానే దాతని వెతికి విద్యార్థులకు చక్కటి వసతులు కల్పించిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా మండల విద్యాశాఖ నుండి అభినందించడమైనది. ప్రతి ఉపాధ్యాయుడు ఇట్లాంటి అవకాశాలు విద్యార్థులకు కల్పిస్తేపాఠశాలల్లో పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని ఏంఈఓ తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మాస్టర్ మల్లారెడ్డి,ఉపాధ్యాయులు కృష్ణ, జానపాటి సాంబయ్య,జానపాటి ముత్యాలు , నడ్డి నరేష్, నడ్డి సాంబయ్య,శ్రీకాంత్, కొటేష్, కంసాని వంశీ, తదితరులు పాల్గొన్నారు.