కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి..

నవతెలంగాణ-ధర్మసాగర్
ప్రాథమిక విద్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య వరకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలని సమ సమాజ విద్యార్థి సంఘం వ్యవస్థాపకులు వెల్దండి సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పొందుపరిచిన  విధంగా కేజీ టు పీజీ వరకు సమాజంలోని ప్రతి వ్యక్తికి ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో 20% నిధులను కేటాయించి, యూనివర్సిటీలతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే మోయాలన్నారు. అధికంగా ఇంజనీరింగ్,మెడిసిన్,డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రైవేటుకు అనుమతించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్  స్కాలర్షిప్ మంజూరు చేయడం ద్వారా ఆర్థిక భారం మోయడం,విద్యా వ్యవస్థలో లోపంగా భావించాలని అన్నారు. యాజమాన్య కోట,కన్వీనర్ కోట సీట్ల భర్తీల విషయంలో పారదర్శకం లేదని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారనేది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ప్రతి విద్య సంవత్సరంలో వేలాది ఇంజనీరింగ్ సీట్లు పూర్తి కాకపోవటం ద్వారా, ఉపాధ్యాయులను భర్తీ చేయలేక,విద్య వ్యవస్థ  నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని హెచ్చరించారు. ఇలా ఉత్తీర్ణ శాతం తగ్గిపోతు, ఆర్థిక ఆరోగ్యం సమయం వృధా కాకుండా ఎంట్రన్స్ పరీక్షలను రద్దు పరచాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగ భర్తీ వలన రిజర్వేషన్ వర్గాలకు రిజర్వేషన్ల అమలు లేక నష్టపోతున్నారని, విద్యాసంస్థల భవనాలు హాస్టల్లో భవనాలు నిర్మాణాలు చేపట్టి రెగ్యులర్ బోధన బోధ నేతర సిబ్బందిని నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.