ఉచిత కంటి వైద్య శిబిరం

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో గురువారం కామారెడ్డి పట్టణానికి చెందిన మ్యాక్స్ కేర్ హాస్పిటల్ సహకారంతో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కంటి సమస్యతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, ఎంపీటీసీ చంద్రకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పోతిరెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీడీసీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.