రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

నవతెలంగాణ- బొమ్మలరామారం

రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి గ్రామం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.90 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి,కంటి సమస్య ఉన్న 6 మందికి విద్యార్థులకు వివేరా హోటల్స్ యజమాని సద్ది వెంకట్ రెడ్డి ద్వారా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పక్కీరు కొండల్ రెడ్డి, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రోటరీ సభ్యులు ఎస్.పి ఉపేందర్ రావు, హమీద్ పాషా, రెడ్ క్రాస్ జిల్లా డైరెక్టర్ యాసీంసి, చైర్మన్ యస్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. నర్సిoహ, ఉపాధ్యాయులు బి.సత్యం, బి.మల్లయ్య,వి.సుజ్ఞాని, బాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు,చంద్రశేఖర్,సుమంత్ హాస్పిటల్ వైద్య బృందం కృష్ణమూర్తి,సాజిద్, తదితరులు పాల్గోన్నారు.